Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
మహిళా స్వయం సహాయక సంఘాలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాల యంలో అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోని మహిళా సంఘాల సభ్యులు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇప్పిస్తున్న రాష్టం తెలంగాణ అన్నారు. నాణ్యమైన నిత్యా వసరాలను అందించడంతో పాటు సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతీ గ్రామంలో వివిధ రకాలైన ఐదేసి తెలంగాణ ఎస్ఎచ్ జీ స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో దాదాపు 3,172 తెలంగాణ ఎస్ఎచ్ జీ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా దాదాపు రూ.33 కోట్ల ఆర్ధిక సాయం బ్యాంకుల ద్వారా అందించబోతున్నామని మంత్రి తెలిపారు. వీటిని ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 15 తేదీలోగా అన్ని గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. వీటి ఏర్పాటు విషయంలో స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవా లని కోరారు. సోమవారం తన కార్యాలయంలో రంగా రెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి, సెర్ప్ పనితీరును సమీక్షిం చారు. వీటి ద్వారా మహిళలకు సుస్థిర జీవనోపాధితో పాటు, ఆదాయాభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొ న్నారు. యాంత్రిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి గాను అవసరమైన పనిముట్లను సమకూర్చుకోవడానికి రైతు సేవా కేంద్రాలు ఇప్పటికే యాచారం, నేదునూర్‌లో ఏర్పాటు చేశామనీ, త్వరలో కేశంపేట, మాడ్గుల, చేవెళ్ల లో ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు గతే డాది రూ.480 కోట్ల రుణాలు అందజేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లను రుణాలుగా అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నట్టు వెల్లడించారు. ఇందుగనుగుణంగా ఆదాయాభివృ ద్ధి కార్యక్రమాలకు రుణాలిచ్చే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో రైతులు పండి ంచే పంటలను కొనుగోలు చేసి, లాభాలను ఆర్జించే విధంగా మండల స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి, బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతేడాదిలో 22,292 మంది మహిళలతో నూతనంగా 2,260 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ సంఘాలకు ప్రస్తుత ఏడాదిలో రుణాల ను అందించే ప్రక్రియను చేపట్టాలని మంత్రి. సూచిం చారు. జిల్లాలోని గిరిజన రైతుల పంటపొలాల్లో బోర్లు వేసేందుకు, పంటపొలాలను అభివృద్ధి వేసేందుకు ఎన్ని నిధులకైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, అర్హులైన గిరిజనులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి ప్రభాకర్, అదనపు వీడి జంగారెడ్డి, నీరజ, తదితరులు పాల్గొన్నారు.