Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
డివిజన్లోని పలు రకాల సమస్యల పరిష్కారం వైపుగా వెళ్లాలంటే అది కేవలం స్థానిక ఎంపీ రేవంత్‌రెడ్డి సహకారం తోనే సాధ్యమని ఎల్బీనగర్ ఇన్చార్జి మల్రెడ్డి రామ్‌రెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు మకుటం సదాశివుడు అన్నారు. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని కాప్రాయి చెరువు వర దతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల సమస్యలు, దాని పరిష్కారాలు, సాగర్ కాంప్లెక్స్, బీఎన్‌రెడ్డి నగర్ నుం చి వచ్చే మురుగునీరు ట్రంక్ లైన్ సమస్యలు, గతేడాది చేసి న పనులకు సంబంధించిన బిల్లులతో పాటు కాలనీలో కమ్యూనిటీ భవనాలు, 201 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ సమస్యల గురించి ఎంపీ రేవంత్‌రెడ్డిని వారి నివాసంలో కలిసి తెలియజేసినట్టు తెలిపారు. వెంటనే స్పందించిన ఎంపీ స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ మొ ద్దు లచ్చిరెడ్డితో కలిసి సంబంధిత ఇరిగేషన్ అండ్ జీహెచ్ ఎంసీ అధికారులతో 15వ తేదీలోపు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పి హామీని చ్చినట్టు తెలిపారు. ఈ వర్షాకాలంలో చెరువుపైన ఉన్న కాల నీలకు గానీ, కింద ఉన్న కాలనీలకు గానీ, గతంలో మాది రిగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు చేయిస్తా మని తెలిపారు. 201 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ సమస్యకి త్వరంలో ఆయా కాలనీ వాళ్లతో మాట్లాడి, దానిపై ఏం చేయాలో తొందర్లో తగిన నిర్ణయం తీసుకుని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో హరిహారపురం కాలనీ అధ్యక్షులు వెదిరె హనుమ ంత్‌రెడ్డి, సెక్రెటరీ జనార్దన్‌రెడ్డి, నరసింహారెడ్డి, సందీప్‌రెడ్డి, శంకర్‌గౌడ్, మురళీకృష్ణ, దేవేందర్, జనార్ధన స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు వినరు పటేల్, తదితరులు పాల్గొన్నారు.