Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ మేడ్చల్ డీఎంహెచ్ఓకు వినతి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కరోనా రోగులను అడ్డగోలు ఫీజుల దోపిడీ చేస్తున్నాయనీ, వాటిని అరికట్టాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వ ర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి మల్లికార్జున్‌కు డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.విజరు కుమార్, జిల్లా నాయకుడు సంతోష్, నరేష్ సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేటు హాస్పిటల్స్ కరోనా పేషెంట్స్‌కు వైద్యం అందిస్తామని చెప్పి పర్మిషన్ తీసుకుని, కరోనా వచ్చిన పేద, బలహీన వర్గాల ప్రజల నుంచి రూ. లక్షల బిల్లులతో అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నార న్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హౌలిస్టిక్ హాస్పిటల్లో అక్రమంగా రూ.లక్షల ఫీజులు చెల్లించాలని కరోనా పేషెంట్స్ కుటుంబాలను వేధిస్తున్నారని తెలిపారు. 10 రోజులకు ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పేద పేషంట్‌కు రూ.12 లక్షల బిల్లు చెల్లించాలని జులుం చేస్తు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి అక్రమంగా ఫీజులు వసూళ్లు చేస్తున్న హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకుని, పేదప్రజలకు తగిన వైద్యం అందేలా చూడాలని కోరారు. జిల్లా డీవైఫ్ఐ నాయకుడు సంతోష్ రాథోడ్ మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీకర హాస్పిటల్, ఈసీఐఎల్ లోని తులసి, సూర్య, జీనియా, ప్రసాద్, మ్యా ట్రిక్స్, ఉప్పల్, మేడ్చల్‌లోని ఆనంద్, వీవీర్, ఆదిత్య, ప్రజ్ఞ, నీలపురి, పులమి, హౌప్ హాస్పిటల్, అనుశ్రీ హాస్పిటల్స్, హర్ష-కొంపల్లి, సజన-సుచిత్ర, మెడివిషన్ సూపర్ స్పెషా లిటీ, రవి, సన్ స్టార్, ఐకాన్-కేపీహెఎచ్బీ, ట్రినిటీ, సాంఖ్య, సన్ ఫ్లవర్-నేరేడు మెట్, మెడిసిన్, లీల, శ్రీ సూర్య-మేడ్చల్, అలవి, శ్రీ స్వస్తిక్, గాలెన్, మెట్రో -మియపూర్, లైఫ్ స్ప్రింగ్-మల్లాపూర్, ఇన్నోవా -తార్నాక హాస్పిటల్స్ విపరీతంగా కరోనా రోగులను నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయనీ, వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా అనుమతులు లేకున్నా పై ఆస్పత్రులతో పాటు అనేక ఆస్పత్రులు ట్రీట్మెంట్ చేస్తున్నాయన్నారు. జిల్లా లోని అన్ని ప్రయివేటు ఆస్పత్రులపై తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.