Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనాతో దెబ్బతిన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామాగౌడ్ తెలిపారు. టీపీసీసీ పిలుపు మేరకు కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధుల బారిన పడ్డ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందజేయాలని కోరుతూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను బాచుపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాగౌడ్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. రాష్ట్రంలో వైద్యం అందక, ఆర్థిక స్థోమత లేక ఎంతోమంది ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఆరోగ్యశ్రీ మన దగ్గర అమలు చేయకపోవడంతో పేద ప్రజలు కరోనా వస్తే ఇక మరణమే శరణ్యం అంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మానవ త్వం చూపకుండా మనసు లేని వ్యక్తిగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ బాటలోనే నడుస్తూ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని విమ ర్శించారు. రాష్ట్రంలోని మరణాలకు కారణం సీఎం కేసీఆరే అన్నారు. శాసన మండలి, సభలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చుతామని హామీ నిచ్చి 9 నెలలైనా నేటికీ అమలు చేయలేదన్నారు. విపత్కర పరిస్థి తులను దృష్టిలో పెట్టుకుని కరోనా బాధితులు, ఫంగస్ బారిన పడు తున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలనీ, లేనిపక్షంలో ప్రజా ప్రతిని ధులను ఎక్కడికక్కడే ముట్టడించి ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎస్తేరు నాని, రామకృష్ణ, సాయి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.