Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలను ఆదుకోవాలి
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సుధీర్ఘ పోరాటాల ఫలితంగా మార్చి 22వ తేదీన అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా పీఆర్సీకి సంబంధించిన అంశాలపై తక్షణమే జీవోలు విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియే షన్ కోరుతున్నది. కనీసం జూన్‌లోనైనా ఉద్యోగ, ఉపాధ్యా యులకు కొత్త పీఆర్సీ వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని టీఈఏ డిమాండ్ చేసింది. లేని పక్షంలో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందో ళనా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించింది. అసోసి యేషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఈఏ నాయకులు మాట్లాడుతూ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాల ను ఆదుకోవాలనీ, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం ఇవ్వాలనీ, వెంటనే ఆ కుటుంబం లో ఒకరికి వారి అర్హతను బట్టి తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధులను సమ ర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఉచిత వ్యాక్సి న్ వెంటనే ఇవ్వాలన్నారు. వారికి 25శాతం రిస్క్ అలవెన్స్ తోపాటు 10శాతం వేతనం అదనంగా ఇవ్వాలనీ, కరోనా వచ్చిన ఉద్యోగులందరికీ 21 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలనీ, డాక్టర్స్, నర్సెస్, పారా మెడికల్ సిబ్బందికి క్వారంటిన్ లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు, కార్పొరేట్, ప్రభుత్వాస్ప త్రుల్లో ఉచితంగా నగదు రహిత చికిత్సను అందించాలనీ, కరోనా, బ్లాక్ ఫంగస్‌లను ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో చేర్చాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తు న్న డాక్టర్లు, నర్సెస్, పారా మెడికల్ సిబ్బందిపై చాలా పని ఒత్తిడి ఉందనీ, రాబోయేది కరోనా థర్డ్ వేవ్ అంటుడటం తో వెంటనే పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ ప్రాతిపదికన డాక్టర్లు, నర్సెస్, పారా మెడికల్ సిబ్బందిని నియమించి వారికి భవి ష్యత్‌లో జరగబోయే శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఈఏ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ సంపత్ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ జి. నిర్మల, తదితరులు పాల్గొన్నారు.