Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెటింగ్
- రూ.50 వేలకు విక్రయిస్తున్న నలుగురు అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగించే యాంఫోటె రిసిన్-బి ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు డాక్టర్లతోపాటు ఫార్మసిస్ట్, టెక్నీషియేన్ను నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు ఇంజెక్షన్లు, నాలుగు సెల్ఫోన్లతోపాటు రూ.29,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం డీసీపీ రాధా కిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ కాలనీ కి చెందిన డాక్టర్ డి.రమేష్ కుమార్ బీఏఎంఎస్ పూర్తి చేశాడు. స్థానికంగా క్లినిక్‌ను నడిపిస్తున్నాడు. నాగోల్‌కు చెందిన డాక్టర్ లింగాలా రాఘవేంద్రగౌడ్ మలక్‌పేట్‌లోని నిఖిల్ అండ్ యూఎస్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. యూ సుఫ్గూడాకు చెందిన జాలు శ్రీకాంత్ సచివాలయం ఎదు రుగా వున్న మెడికవర్ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచే స్తున్నడు. అదే ఆస్పత్రిలో మెడికల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న మాహ్మద్ అర్శద్లు కలిసి ఒక ముఠాగా ఏర్పా డ్డారు. బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగించే యాంఫోట ెరిసిన్-బి ఇంజెక్షన్లు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండ డంతో వాటిని అధిక ధరలకు విక్రయించి సులువుగా డ బ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమ ంలో ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కావాల్సిన వారికి అవసరమైన వారికి రూ.50వేలకు విక్రయిస్తు న్నారు. ఇంజెక్షన్ ఎంఆర్పీ రూ 7,400 ఉంది. అధిక ధర లకు విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కే.నాగేశ్వర్రావు నిందితులపై ప్రత్యేక నిఘా వేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలోవున్న మరో నిందితుడు వి.సైదులు అనే మెడికల్ ఏజెంట్ కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను సైఫాబాద్ పోలీసులకు అప్పగించి నట్టు డీసీపీ తెలిపారు.