Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-నారాయణగూడ
తాళ్లపాక అన్నమాచార్యుల 613వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరానికి చెందిన హరినారాయణాచార్యులు, రామచంద్రు తేజావత్, ఐఏఎస్ (రిటైర్డ్) స్పెషల్ రిప్రెజెంటేటివ్ ప్రభుత్వ సలహాదారులు(ఢిల్లీ) డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా అన్నమాచార్యుల విశిష్ట రచనలు, కీర్తనలు శ్రీవెంకటేశ్వర స్వామి వారిపై రాసిన, పాడిన సంకీర్తనలు మహా అద్భుతాలుగా అభివర్ణించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచం మొత్తం ఆచరించే విధంగా ఉన్నాయని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ సంప్రదాయాలు పాటిస్తూ ఉజ్వల భవిషత్తుతో ఉత్తమ పౌరులుగా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు లయన్ లలితారావు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ అన్నమాచార్య సంగీత నృత్యోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి చిన్నారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారని, చక్కటి నృత్యాలతో అద్భుతంగా అలరించారని తెలిపారు. సంగీత, నృత్య గురువులు డాక్టర్ నిర్మలా విశ్వేశ్వర్, విష్ణుప్రియ శ్రీకాంత్, హేమసుధ, కవిత, విష్ణుప్రియ, ఉదయ, మాగంటి వసుధ, భువనేశ్వరి, సరయు, పేరిణి రవి, నాగ చందన, శ్రీదేవి, అర్చన, మనీష, ఎన్.వి.శ్రీలక్ష్మి, మీనా, సీతాలక్ష్మి ప్రసాద్, చిన్నారులతో నృత్యాలను ప్రదర్శింపజేశారు.