Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- సనత్‌నగర్ నియోజవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-బేగంపేట్
వర్షాకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో సెంట్రల్, నార్త్ జోనల్ కమిషనర్లు ప్రావీణ్య, శ్రీనివాస్‌రెడ్డి, వాటర్‌వర్క్స్ ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బీకేగూడ పార్కు సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రూ.4.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భవనం డిజైన్ నమూనాను సిద్ధం చేయాలని ఆదేశించారు. బన్సీలాల్‌పేట డివిజన్లోని గండమ్మ గుడి వద్ద డ్రయినేజీ ఓవర్ ప్లో సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వాటర్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీటిసరఫరా జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను తయారు చేసి అందజేయాలని వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్‌ను ఆదేశించారు. మేకలమండిలో నిరుపయోగంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డిని ఆదేశించారు.