Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.1,91,90,500 ల విలువ గల చెక్కులను సోమవారం 37 మంది బాధిత కుటుంబాలకు కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్‌గౌడ్, ఉప్పల పాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్‌రావులతో కలిసి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆప్పన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానందనగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఆల్వీన్‌కాలనీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, నాయకులు సైదేశ్వర్, కార్తీక్‌రావు, వెంకటేశ్వర్లు, మున్నా, గోపిచంద్, చంద్రిక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.