Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య
నవతెలంగాణ-తుర్కయాంజల్
సీఎం సహాయనిధితో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్యయ్య అన్నారు. సోమవారం తుర్కయంజాల్ పరిధిలోని బ్రహ్మనపల్లికి చెందిన ఓబుళాపురం కావ్య దయాకర్‌కు రూ. 33వేలు, తుర్కయాంజల్‌కు చెందిన బండారు రాజుకు రూ. 56వేలు సీఎం సహాయనిధి చెక్కులను తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ సహకార బ్యాంక్ డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, కౌన్సిలర్ ఫోరం అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ ఏనుగు మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కందాల సురేందర్ రెడ్డి, గుండా ధనరాజ్, పుల్లగురం విజయానంద్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, కొల్లూరి నిరంజన్ రెడ్డి, మేతరి శంకర్, నల్లవెల్లి కార్తీక్, గొరిగే ఐలయ్య, శ్రీశైలం, ఓబుల్ పురం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.