Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం అంబర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్లో సూపర్ స్ప్రెడర్లకు చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా కోసం వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని,. భౌతిక దూరం పాటించాలని సూచించారు. టోకెన్లు తీసుకున్న వారినే వ్యాక్సిన్నకు అనుమతించాలని చెప్పారు. టీకా కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.