Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే తగ్గించాలని డిమాండ్
- కేంద్రం వైఖరిని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మలు దహనం
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సోమవారం పలుచోట్ల ధర్నాలు, నిరసనలు జరిగాయి. మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో జవహర్‌నగర్ , నేరేడ్మెట్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మల్లాపూర్‌లో నిరసనలు చేపట్టారు. మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నవతెలంగాణ-జవహర్‌నగర్/మల్కాజిగిరి/
జగద్గిరిగుట్ట/దుండిగల్
జవహర్‌నగర్‌లో ..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సీపీఐ కార్యదర్శి దర్శనం యాదగిరి డిమాండ్ చేశారు. ధరలు పెంపును, కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాప్రా మండలం జవహర్‌నగర్ ప్రధాన రహదారిపై ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు పుట్టెడు కష్టాల్లో ఉంటే, ఆకలితో అలమటిస్తుంటే.. ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ధరలు పెంచి భారాలు మోపడం దారుణమని మండిపడ్డారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వి.వెంకటా చారి, కార్మికనగర్ శాఖ కార్యదర్శి కనకుంట్ల ప్రవీణ్, ఎస్ శివ, కె.రాజు, ఎం.అశోక్ చారి, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరేడ్మెట్లో
పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను రోజు రోజుకూ పెంచుతూ పోవడం దుర్మార్గమని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలనిసీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రొయ్యల కష్ణమూర్తి డిమాండ్ చేశారు. సీపీఐ మల్కాజ్గిరి మండల పార్టీ అధ్వర్యంలో నేరేడ్ మెట్‌లోని కాకతీయనగర్ భవన నిర్మాణ కార్మికుల అడ్డావద్ద ధర్నా నిర్వహించారు.సీపీఐ మండల కార్యదర్శి టి.యాదయ్య గౌడ్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి కె.అశోక్, కాకతీయ నగర్ లేబర్ అడ్డా అధ్యక్షులు జే.వెంకటరమణ, అధ్యక్షులు కుంచాల నాగయ్య, ప్రధాన కార్యదర్శి సి.ఎచ్.ఆనంద్‌రావు, నాయకులు లింగం, జీ.రామాంజ నేయులు, ఎస్.కే.కాసిం, ఏడు కొండలు, మహిళ నాయకురాలు కళావతి, అలివేలు, లక్ష్మమ్మ, రాజేశ్వరి, పుష్పమ్మ, లక్ష్మీ, పాల్గొన్నారు.
ప్రగతినగర్‌లో
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలపై పెనుభారం పడుతోందని, ధరలను యంత్రించడంలో కేంద్ర సర్కారు విఫలమైందని సీపీఐ జాతీయ సమితి పిలుపులోఉ భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రగతినగర్ మూడుకోతుల సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, మండల కార్యదర్శి పాలబిందల శ్రీనివాస్ పాల్గొన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాములు, కరుణాకర్ రెడ్డి, వెంకటేష్, శివ, ఉపేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్టలో
పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో సోమవారం జగద్గిరిగుట్ట చివరి బస్టాప్‌లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్ సహాయ కార్యదర్శి కె.దుర్గయ్య, ఏఐటీయూసీ అధ్యక్షులు హరినాథ్, ఏఐవైఎఫ్ కన్వీనర్ జి.వెంకటేష్, కార్యదర్శివర్గ సభ్యులు కె.వెంకటేష్, ప్రవీణ్, రాములు, స్థానిక నాయకులు సత్యనారాయణ, చంద్రయ్య, శ్రీనివాస్‌చారి, చాంద్, మల్లేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.