Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేటీసీ జే. పాండురంగ నాయక్
నవతెలంగాణ- సిటీబ్యూరో
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏకైక అస్త్రం వ్యాక్సినేషనేనని, ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆటో, మోటర్, మాక్సీక్యాబ్ డ్రైవర్లు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ (జే టీ సీ) జే. పాండురంగ నాయక్ అన్నారు. ప్రభుత్వం మార్గనిర్దేశంలో ఆరోగ్యశాఖ సహకారంతో రవాణాశాఖ చేపట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్లో మొత్తం 10 సెంటర్లలో స్ఫెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఖైరతాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో డ్రైవర్లకు అందిస్తున్న వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని సోమవారం జే టీ సీ సందర్శించారు. వ్యాక్సిన్ తీసకోవడానికి వచ్చిన డ్రైవర్లు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి చర్యలు ఎలా కొనసాగుతున్నాయని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఖైరతాబాద్ ఆర్టీవోలు ఎల్ రామ్ చందర్, పి.దుర్గాప్రసాద్, ఎంవీఐలు పాల్గొన్నారు.