Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ దర్శకనిర్మాత బీ. నరసింగరావు
నవతెలంగాణ-కల్చరల్
సుద్దాల హనుమంతు గీతాలు చైతన్య దీపికలని, ఆయన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో పాటలు రాశారని సినీ దర్శక నిర్మాత బీ.నరసింగరావు అన్నారు. తేజ సాహితీ సేన, సుద్దాల ఫౌండషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు 112వ జయంతిని జూమ్ వేదికగా నిర్వహించారు. నరసింగరావు మాట్లాడుతూ.. ప్రజల జీవితాలను, వారి కష్టాలలను దగ్గరనుంచి చూసి రచన చేయటంవల్ల ఆయన పాటలు నేటికీ సజీవంగా నిలిచాయన్నారు. తాను నిర్మించిన మా భూమి చిత్రంలో 'పల్లెటూరి పిలగాడా' పాట ఇప్పటికీ జనం నాలుకలపై నిలిచి ఉందని గుర్తు చేశారు.
భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాలగడ్డ అని, ఇక్కడ అణచివేత ఎదురైనప్పుడల్లా కవులు, కళాకారులు ఎదిరించి నిలిచారని అన్నారు. సుద్దాల హన్మంతు ఉద్యమ కెరటం అని, గీతాలతో సమాజాన్ని ప్రభావితం చేశారని అన్నారు. ఆయన జీవితం నవ తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలన్నారు. గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ ముందుగా హన్మంతు వ్యక్తిత్వం, సాహిత్యం పరిచయం చేశారు. చరిత్ర పరిశోధకులు హరగోపాల్, గాయని రచ్చ భారతి, సుద్దాల ప్రభాకర్ తేజ, జల్దీ సుదర్శన్, చారి, పిల్లలమర్రి రాములు తదితరులు మాట్లాడారు. డాక్టర్ పొరెడ్డి రంగయ్య కార్యక్రమాన్ని సమ న్వయం చేశారు.