Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలను బలి చేయవద్దని బాధితుల ఆవేదన
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీ భూ సమస్యను కొంతమంది కాలనీ పెద్దలు కావాలనే వివాదాస్పందం చేస్తూ డబ్బులు దండుకునేందుకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ ప్లాట్లను కొన్న బాధితులు యాదగరి, నర్సింహ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా విష్ణుపురికాలనీ, శ్రీపాద ఎన్‌క్లేవ్‌పై నడుస్తున్న వివాదంపై మరో వర్గం మంగళవారం వివరణ ఇచ్చింది. సర్వే నంబర్ 122 పార్టు, 124 పార్టులలో ముస్లింలకు, వంశపారపర్యంగా జమాల్‌కు వచ్చిన భూమని 1979లో లేఅవుట్ చేశారని తెలిపారు. దీనికి ఆనుకుని ఉన్న సర్వేనంబర్ 125, 126, 127, 79లలో గల భూమిని పోగుల నర్సింహ్మరెడ్డి తన ల్యాండ్ 9 ఎకరాల 20 గుంటలతో పాటుగా జమాల్ కు తెలియకుండా ఆయన ల్యాండ్‌ను కలుపుకొని మొత్తం 16 ఎకరాల 20 గుంటల ల్యాండ్ 2 లే అవుట్లు చేశారని తెలిపారు. దీనిపై జమాల్ దగ్గర ప్లాట్లు కొన్నవారు, 126, 127, 79లలో గల భూమిని పోగుల నర్సింహ్మరెడ్డి, తన ల్యాండ్ 9 ఎకరాల 20 గుంటలతో పాటుగా జమాల్‌కు తెలియ కుండా ఆయన ల్యాండ్‌ను కలుపుకొని మొత్తం 16 ఎకరాల 20 గుంటల ల్యాండ్ 2 లే అవుట్లు చేశారని తెలిపారు. దీనిపై జమాల్ దగ్గర ప్లాట్లు కొన్నవారు కోర్టును ఆశ్రయించగా 1998-20లో ఎంక్వైరీ కమిషన్ వేయాలని, అలాగే ఏడీ సర్వే చేయాలని తెలిపిందని, ఏడీ సర్వే రిపోర్టు కూడా ఈ ల్యాండ్ జమాల్ సంబంధించిందని రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. లే అవుట్ 2016లో జమాల్ దగ్గర నుండి మల్లికార్జున్‌రెడ్డి తీసుకున్నారని, వారి నుంచి మహేష్, నారాయణ, ఉషారాణి, రంగారెడ్డిలు తీసుకున్నారని తెలిపారు. వారి నుండి 2019లో గందమల్ల యాదగిరి, నర్సింహ్మ, అయిలయ్య, నాగేష్, సుమన్‌గౌడ్, విజరుగౌడ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీస్ స్టేషన్లో, స్థానిక ఎమ్మార్వోకు కాపీ ఇచ్చామని, దీంతో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దని చెప్పినా వినకుండా కాలనీలోని ఉమా మహేశ్వర్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మరికొంత మంది యథేచ్ఛగా క్రయవిక్రయాలు చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారన్నారు.
దీనిపై అనేకమార్లు కమిషనర్ దృష్టికి తీసికెళ్లినా కూడా దృష్టిసారించకపోవడంతో డిప్యూటీి మేయర్, కొంతమంది కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లడం తో నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వవద్దని ఆపివేయడం జరిగిందన్నారు. ఇంతటితో ఆగకుండా కార్పొరేటర్ల పై, డిప్యూటీ మేయర్‌పై నిందలు మోపుతూ వారిపై దుష్ప్రచారం చేస్నున్నారు. ఇది తగదని, ఇటువంటి ల్యాండ్‌కు సర్వేచేయడానికి సహకరించాలని, సర్వే లో ఎవరి భూమి అని తేలితే వారికి వదిలేద్దామని, దీనికి మీరు సిద్ధ్దమా? అని బహిరంగంగా సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో గందమల్ల యాదగిరి, నర్సింహ్మగౌడ్, నాగేష్, సుమన్‌గౌడ్, విజరుగౌడ్, కుమార్ గౌడ్ పాల్గొన్నారు .