Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా టీకా వేసుకున్న వారికి రూ.300/- ఉచిత వోగో రైడ్స్
నవతెలంగాణ-హైదరాబాద్
వోగో భారతదేశంలో ద్విచక్రవాహనాలను అద్దెకు అందించే అతి పెద్ద కంపెనీ. ఈ సంస్థ ప్రజలకు టీకా పట్ల సందేహాన్ని తొలగించటానికి మరియు ప్రోత్సహించటానికి టీకాలు వేసుకునేందుకు
''గో సేఫ్'' పేరిట ఒక నూతన ప్రక్రియను ఆవిష్క రించి, టీకా పొందిన ప్రతి ఒక్కరికి రూ.300/- విలువైన ఉచితన రైడ్స్ (ప్రయాణాలు) వోగో అంది స్తుంది. ఈ ఉచిత రైడ్ పొందుటకు వినియోగ దారులు, తమ పూర్తి/పాక్షిక టీకా వేయించుకున్న సర్టిఫికేట్ను వోగో యాప్ నందు అప్లోడ్ చేయాలి. వోగో యాప్ నుండి కూడా కోవిన్నకు లాగిన్ అయిన తమ టీకాలు కొరకు స్లాట్స్ బుక్ చేసుకునేందుకు కంపెనీ అనుమతిస్తుంది. ప్రతి వినియోగదారుని తరుపున అనగా టీకా సర్టిఫికెట్ అప్లోడ్ చేసే తరపున రూ.1000/-లను 50 ఆస్పత్రుల్లో పనిచే యుటకు నిధులుగా అందిస్తుంది.
ఈ పథకం ప్రణీత సుభాష్ ఫౌండేషన్ అండ్ గుడ్ స్కౌట్స్, పారిశ్రామిక వేత్తల కన్సోర్టియం, సాంఘిక సంక్షేమ వర్గాలు, వేర్వేరు పరోపకారులు చేత ప్రారంభించారు. దేశంలో స్థబ్దతగానున్న 50 వైద్యశాలలను గుర్తించి, వాటికి అవసరమైన ప్రాథమిక వైద్య సౌకర్యాలు సమకూర్చి కోవిడ్ రోగులకు ఉచితంగా చికిత్స అందించే దిశగా పనిచేయిస్తున్నారు. కంపెనీ తనవైపునుండి రూ.8 లక్షలు నిధిని అందించింది.