Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
పీడీ యాక్ట్ పేరుతో తమ కుటుంబాన్ని వనస్థలిపురం పోలీసులు వేధిస్తున్నారని, మంగళవారం ఉదయం వాహనంలో వచ్చి తమ కుటుంబ సభ్యులను తీసుకు వెళ్తామన్నారని గడుసు నర్సింహ భార్య పుష్పలత ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఆపకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని ఆమె హెచ్చరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ జోక్యం చేసుకుని హార్ట్ పేషెంట్ అయిన తన భర్తకు ప్రాణబిక్ష పెట్టాలని ఆమె వేడుకున్నారు. మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీలతారెడ్డి తన భర్తపైన తప్పుడు కేసు పెట్టిందని, ఆ తర్వాత డబ్బులు తీసుకొని ఆ కేసులకు ఎలాంటి సంబంధం లేదని రాజీ పత్రాలు రాసి ఇచ్చినప్పటికీ వనస్థలిపురం సీఐ మురళీమోహన్, ఏసీపీ పురుషోత్తంరెడ్డిలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. కేసులు పెట్టినప్పుడు సీఐని తన భర్త నర్సింహ్మ అడగగా ఏసీపీి కేసు పెట్టమన్నాడు అందుకే పెడుతున్నానని చెప్పాడని, తన భర్తపైన మూడు తప్పుడు కేసులు ఏసీపీ పెట్టమంటేనే తను కేసు పెట్టానని చెప్పిన సీఐ ఆ కేసులను ఆసరాగా చేసుకుని తన భర్తను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆ మూడు కేసులలో గతనెల 21న శ్రీలతారెడ్డి ఎలాంటి సంబంధం లేదని, అతని పేరు తొలగించాలని రాతపూర్వకంగా రాసి ఇచ్చినప్పటికీ తన భర్త పేరు తీసి వేయకుండా వనస్థలిపురం పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పీడీ యాక్ట్ కేసు కింద జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని, తన భర్త నరసింహను పోలీసులకు అప్పగించకపోతే అందరినీ జైలుకి పంపుతామని బెదిరిస్తున్నారని లామె ఆరోపించారు.