Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్న కొడుకునే చంపిన తల్లి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆ తల్లికి మనసెట్లా వచ్చిందో.. నవమాసాలు మోసి, అల్లారుముంద్దుగా పెంచిన కన్నకొడుకునే కడతే ర్చిందా కఠిన హృదయురాలు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి భగత్‌సింగ్ నగర్లో ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా, జగద్గిరిగుట్టకు చెందిన సురేష్‌కు ఉదయ అనే మహిళతో ఐదేండ్ల కిందట పెండ్లి జరిగింది. వీరికి కుమారుడు ఉమేశ్ (3) ఉన్నాడు. ఇదిలా ఉండగా సురేష్ భాస్కర్ అనే మేస్త్రీ వద్ద పనికి వెళ్తుండే వాడు. సురేష్ పనికి వెళ్లిన టైమ్‌లో ఉదయ భాస్కర్‌తో చను వుగా ఉండసాగింది. క్రమంగా అదికాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని గమనించిన సురేష్ భార్యను పలుమార్లు హెచ్చరించినా వినలేదు. దీంతో సురేష్, ఉదయ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో రెండేండ్ల కిందట ఉదయ సురేశ్‌తో విడిపోయి, కుమారుడు ఉమేష్(3)తో కలిసి భగత్‌సింగ్‌నగర్ వెళ్లి భాస్కర్‌తో సహజీవనం చేస్తోంది. సురేష్ తన కుమారుడిని చూడటానికి భగత్‌సింగ్ నగర్ కు అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు. కొడుకుకోసం సురేష్ తరచూ తమవద్దకు వస్తుండటంతో, సురేష్‌పై కోపంతో కొడుకు ఉమేశ్(3)ను ఎలాగైనా చంపివే యాలని తల్లి ఉదయ నిర్ణయించుకుంది. మూడేండ్ల బాలుడు అని కూడా చూడకుండా వైర్లతో, కర్రలతో తీవ్రంగా కొట్టింది. దీంతో దెబ్బలు తట్టుకోలేక ఆ పిసి బాలుడు సృహకోల్పోయాడు. దీంతో ఆందోళనకు గురైన ఉదయ అతన్ని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా జాయిన్ చేసుకోకపోవడంతో చివరగా సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరిశీలించిన డాక్టర్లు బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త సురేష్ ఆస్పత్రికి చేరుకుని తన కుమారుడిని భార్య ఉదయ, భాస్కర్లు కలిసి ఘోరంగా చంపారని విలపించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అతని ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. బాలుడిని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.