Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలో విద్యత్ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం వెరసి చేతికి అందేంత ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయని కల్యాణి నగర్ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధిలో సంక్షే మ సంఘం ప్రతిని ధులు కల్యాణి నగర్, పలు బస్తీల్లో మంగళవారం ప్రతిపక్ష నాయకులతో పర్యటించి కాలనీలో నెలకొన్న విద్యుత్ సమ స్యలను పరిష్కరించా లని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలకు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు లో లేనం దున ప్రవాహ నీరు చేరి రాకపోకలు సాగించే వారికి ఎప్పుడు ఏ ప్రమాదం ముచ్చుకొస్తుందోనన్న ఆందో ళనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డివి జన్‌లోని పలు కాలనీల్లో విద్యుత్ హైటెన్షన్ వైర్లు స్థాని కులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. నిల్చుంటే చేతికి అందేంత ఎత్తులో ఉండట ంతో ఇండ్లపైకి ఎక్కాలంటేనే అక్కడి ప్రజలు వణుకు తున్నారు. వర్షాకాలం రావడంతో ఇండ్ల నుంచి బయ టకు రావాలంటేనే భయప డుతున్నారు. ఎక్కడ ఏ తీగ తెగిపడి తమ ప్రాణాలను తీస్తుందోనన్న భయంతో బతుకుతున్నారని అన్నారు. వర్షం పడితే ప్రమాదమే అని, పనుల నిమిత్తం బయటికి వెళ్లేవారు రాత్రి సమ యాల్లో ఇంటికి వచ్చేటప్పుడు ప్రాణా లను అరచేతిలో పెట్టుకుని వస్తున్నారని తెలిపారు. ముఖ్య ంగా పలు కాలనీల్లో భవనాలకు ఆనుకుని విద్యుత్ స్తంభా లు ఉండటంతో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనీ, వాటిని తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లు కట్టన ప్పుడు మెరుపు వేగంతో వచ్చి కరెంట్ కట్ చేసుకుని పోయే విద్యుత్ సిబ్బంది సమస్యల పట్ల కూడా అదే వైఖరిని ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు. వర్షాకాలం లో ఏదైనా విద్యుత్ఘాతం జరిగి, ప్రమాదాలు జరిగితే తప్ప ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పందిం చేలా లేరని వాపోయారు. ప్రజా ప్రతినిధులు, విద్యుత్‌శాఖ అధికారులు సమ స్య తీవ్రతను గ్రహించి వెంటనే చర్యలు చేపట్టలని డిమా ండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణినగర్ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు యూసుఫ్, శ్రీనివాస్‌రెడ్డి, అని తారాణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హరిచంద్, టీడీపీ డివి జన్ అధ్యక్షుడు విజరుకుమార్, దళిత యువరత్న సుంకే రామన్, కాంగ్రెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆకుల నరేం దర్, రాము, తదితరులు పాల్గొన్నారు.