Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
నియోజకవర్గంలోని ఎనిమిది పార్కులను థీమ్, మోడ్రన్ పార్కులుగా అభివృద్ధిపరిచేందుకు నిధులు మంజురయ్యాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. ఈమేరకు మంగళవారం కాచిగూడ విక్రమ్నగర్లోని వార్డు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది పార్కులను థీమ్, మోడ్రన్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు రూ.2.98 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్, టైల్స్, పేయింటింగ్, మొక్కలు నాటడం, సీసీ కెమెరాల ఏర్పాటు పార్కుల చుట్టూ ప్రహరీ నిర్మాణం వంటి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పార్కులకు వచ్చే సందర్శకులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు అనిల్రాజు, ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, ఏఈలు ప్రేరణ, శ్వేత, హార్టికల్చర్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, మేనేజర్ సత్యనారాయణమ్మ, డీడీ మాలిని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డీఈ వెంకటరమణారెడ్డి, ఏఈ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.