Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలతో ప్రజల బతుకులు రోడ్డున పడుతున్నాయని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దిల్సుఖ్ నగర్లోని ఓ పెట్రోల్ బంక్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె, నిత్యావసర ధరలు పెరగడంతో పేదల బతుకులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్లో ఉపాధి లేక, పని దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. హాస్పిటళ్లలో ఆక్సిజన్, మందులు, ఇంజెక్షన్స్, బెడ్లు లేక సరైన వైద్యం అందక ఎంతో మంది మతి చెందారన్నారు. పెట్రోల్ ధర రికార్డ్ స్థాయిలో 102.95 పైసలకు చేరుకుందని, పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకేనపల్లి సుధీర్ రెడ్డి, మొగుల రాజిరెడ్డి, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, మకుటం సదాశివుడు, శశిధర్ రెడ్డి, బండ సురేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, లింగాల కిషోర్ గౌడ్, ముసుకు శేఖర్ రెడ్డి, నర్సింహ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ చరణ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తిపర్తి విజరు భాస్కర్ రెడ్డి, సుజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.