Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
డివిజన్లోని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ కె.పద్మ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్లోని భరత్‌నగర్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాదయాత్రలో స్థానికులు డ్రయినేజీ, మ్యాన్‌హోల్, విద్యుత్, మట్టి కుప్పల తొలగింపు వంటి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పాదయాత్రలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, బీజేపీ నగర మాజీ అధ్యక్షులు బి.వెంకటరెడ్డి, నాయకులు అజరు కుమార్, కోడూరి సురేష్, నాగరాజుచారి, గోవింద అర్జున్, గుగ్గిళ్ల శ్రీనివాస్, బాలకృష్ణ, సుధాకర్, రమేష్, సునంద, మహేశ్వరి, దుర్గాప్రసాద్, ముఖేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు