Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బల్దియా అధికారులకు ఆదేశం
- ఎల్బీనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్ సర్కిళ్ల కార్పొరేటర్లు, అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలన్నింటినీ సంబంధిత కార్పొరేటర్లకు అందజేసి, ఆయా కార్యక్రమాల పురోగతికి వారిని భాగస్వామ్యం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎల్బీ నగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్ సర్కిళ్లలో జరగుతున్న నాలా విస్తరణ, వరద ముంపు నివారణ పనుల పురోగతిపై డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి తదితర అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు సర్కిళ్లలోని కార్పొరేటర్లు హాజర య్యారు. ఈ సందర్బంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడు తూ గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. ఈసారి వర్షాల వల్ల తిరిగి నష్టం వాటిల్ల కుండా ఉండేం దుకు నాలాల అభివృద్ధి, బాక్స్ డ్రయిన్ల నిర్మాణం, చెరువు లకు తూముల నిర్మాణం, నాలాల పూడిక పనులు చేపట్ట డం తదితర ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వర్షాలు మరికొన్ని రోజుల్లో కురిసే అవకాశము న్నందున కొత్తగా డ్రయినేజీ పనులను, తవ్వకాలను నిషేధి ంచామని వెల్లడించారు. ఇప్పటికే, ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్‌నగర్ సర్కిళ్లలో కొనసాగుతున్న పనుల వివ రాలను సంబంధిత కార్పొరేటర్లకు పూర్తి వివరాలు అంద జేసి, ఆ పనులను సకాలంలో పూర్తి చేయడానికి వారి సహా య సహకారాలు తీసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు. త్వరలోనే తాను ఎల్బీనగర్ జోన్లో పర్యటించి అమలవు తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించను న్నట్టు వెల్లడించారు. కార్పొరేటర్లు కూడా ప్రతి రోజూ తమ పరిధిలో ఉదయమే క్షేత్ర స్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరి శీలిస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారని మేయ ర్ పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తమ జోన్ పరిధిలో నాలాల్లో పూడిక పను లు 95 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో వాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగు తున్నందున మొత్తం అధికారులు, సిబ్బంది వాక్సినేషన్లో నిమగమై ఉన్నారనీ, ఈ కార్యక్రమం పూర్తికాగానే వెంటనే కార్పొరేటర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలం వరదలను నివారించేందుకు బాక్స్ డ్రైయిన్ల నిర్మాణం, పూడిక పనులు, నాలాల నిర్మాణం తదితర పనులు ముమ్మరంగా చేపట్టా మని తెలిపారు. ముఖ్యంగా రూ.1.40 కోట్ల వ్యయంతో చెరువుల స్లూయిస్, వెంట్ల నిర్మాణ పనులను చేపట్టామని ఉపేందర్‌రెడ్డి వివరించారు. ఈ సందర్బంగా తమ పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనీ, వరద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్పొరేటర్లు ఈ సమావేశంలో మేయర్‌కు వివరించారు. మొట్టమొదటి సారిగా తమతో ప్రత్యక సమావేశం నిర్వహించడం పట్ల కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లకు కృత్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాధ, కొప్పుల నర్సింహారెడ్డి, వెంకటేశ్వరెడ్డి, పవన్‌కుమార్, లచ్చిరెడ్డి, నర్సింహారావు, నవజీవన్‌రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, అరుణాయాదవ్, మహిపాల్‌రెడ్డి, సుజాత, మూడు సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు, మెడికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.