Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేస్తే కఠిన చర్యలు తప్పవు డీఎంఅండ్‌హెచ్‌ఓ మల్లికార్జున్‌రావు
- జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట పరంగా నేరమనీ, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవ డంతోపాటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల అనుమతుల ను రద్దు చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం (డిస్ట్రిక్ లెవల్ అడ్వయిజరీ కమిటీ) నిర్వహించారు. ఈ సందర్భం గా డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు, వైద్యులు స్కానింగ్ చేసిన తర్వా త ఆడ, మగ అని చెబితే క్రిమినల్ కేసులు నమోదు చేయ డంతోపాటు స్కానింగ్ సెంటర్ అనుమతులు రద్దు చేస్తా మని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 715 స్కానింగ్ సెం టర్లకు అనుమతులు ఉన్నాయనీ, మూడు సెంటర్లపై క్రిమి నల్ కేసులు నమోదు చేసి మూసేశామని తెలిపారు. జిల్లా లో ఆడపిల్లల నిష్పత్తి చాలా తక్కువగా ఉందనీ, అందుకు కారణం కొన్ని స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు జరిపిన అనంతరం అబార్షన్లు చేస్తున్నారని తెలిపారు. ఈ చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని గుర్తించి శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుందనీ, ఆడపిల్లలను బతుకునిద్దాం అనే నినాద ంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధు నిక ప్రపంచంలో సైతం ఆడపిల్ల పుడుతుందని తెలిసిన వెంటనే అబార్షన్లు చేయిస్తున్నారనీ, ఇది ఏమాత్రం మంచి ది కాదనీ, అబార్షన్లు చేసే డాక్టర్లు, ఆస్పత్రులపై కేసులు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేసి పుట్టబోయేది ఆడ శిశువు, మగశిశువు అని నిర్ధారించడం చట్టరీత్యా నేరమనీ, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. గర్భస్థ పూర్వ పిండ లింగనిర్ధారణ నిషేధ చట్టం 1994 నుంచి అమలులో ఉందనీ, అతిక్రమించిన వారిని సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కఠినంగా శిక్షిస్తామనీ, చట్టం అమలుకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. సలహా సంఘ సభ్యులు, ఎన్జీవో కుమారకప మాట్లాడుతూ చట్టం పట్ల స్కూళ్ళు, కాలేజీల్లో అవగాహన కల్పించాలనీ, దీనికి అందరి సహకారం అవసరమన్నారు. జిల్లా సమాచార అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ కార్యాలయం లోని కళాకారులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి ఆడ పిల్లల సంరక్షణ, తదితర విషయాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తామన్నారు. జిల్లా మాస్ మాస్ మీడియా అది óకారి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ చట్టాన్ని అతిక్ర మిస్తే శిక్షలు, నోటీసులు, అపరాధ రుసుములు, అనుమ తుల రద్దు గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావే శంలో జిల్లా సలహా సంఘ సభ్యులు గైనకాలజిస్టు డాక్టర్ మంజుల, పిడియాట్రిషియన్ డాక్టర్ రాజశేఖర్, డీపీఆర్వో కిరణ్ కుమార్, ఆపరేషన్ మెర్సీ ఫౌండేషన్ ఇండియా సభ్యురాలు ఏంజెలా గ్లోరీ, కార్పే డీఐఈఎమ్ ఫౌండేషన్ సభ్యులు కుమార కప, జిల్లా డిప్యూటీ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ వేణుగోపాల్‌రెడ్డి, సలహా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.