Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ప్రభుత్వం కరోనా నివారణకు చేపడుతున్న కార్యక్ర మాలకు అండగా నిలువాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి ప్రాంగణంలో కొవిడ్ కేర్ సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కరూర్ వైశ్యాబ్యాంక్ యాజమాన్యం రూ. 20 లక్షల విరాళాన్ని అందజేసింది. సిటీలో ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతున్న సంగతి తెలిసిందేన కరూర్ వైశ్యాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బి. రమేష్‌బాబు మాట్లాడుతూ తమ సీఎ స్ఆర్ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి అండ గా ఉండాలని, కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు తమవంతు ఆర్థికసాయం అందజేశామన్నారు. కరూర్ వైశ్యాబ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగ ంగా ఇప్పటివరకు రూ. 4 కోట్ల 41 లక్షల ఆర్థికసాయం అందించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేన ేజర్ సి. రామకష్ణ, సేల్స్ హెడ్ రిటైల్ లయబిలిటీ ఎన్. బాలాజీ, నల్లకుంట బ్రాంచ్ హెడ్ ఎం. పవన్ కుమార్, డాక్టర్ సంతోష్ కుమార్, నేషనల్ జాయింట్ సెక్రటరీ (సాక్షం) తదితరులు పాల్గొన్నారు.