Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్, శివశంకర్ నగర్ బస్తీవాసులు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్ పరిధిలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్, శివశంకర్ నగర్ చుట్టూ ఉన్న బస్తీలకు సంబంధించి గతంలో పాత కాలం నాటి డ్రైనేజ్ పైప్ లైన్ ఉండటం వల్ల తరచూ లీకజీ లతో సమస్యలు తలెత్తునందున దాన్ని అధునికరించడానికి నూతన డ్రైనేజ్ పైప్ లైన్ వేయడానికి నిర్ణయించారు. కాగా ఎల్బీఎస్ నగర్ వద్ద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ స్థలం ఉండటం వల్ల దాని గుండా డ్రైనేజ్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే వాటర్ వర్క్స్ ఎండీతో మాట్లాడి ఈ స్థలం గుండా డ్రైనేజ్ నిర్మాణానికి స్థలం కేటాయించమని కోరగా వాటర్ వర్క్స్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సంబంధిత ఎస్టేట్ అధికారులతో కలసి పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని పరిశీలించి దానికి సంబంధించి రూ.20 లక్షల నిధులు కేటాయించాల్సి వస్తుందని అంచ నాలు వేశారు. అదే సమయంలో నాళాల నుంచి వచ్చే నీరు డ్రైనేజీలో కలవకుండా ఎస్టీపీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. దీనికి సంబంధించి అధి కారులు దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యేకు తెలియజేయగా నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొ రేటర్ పండాల సతీష్ గౌడ్, వాటర్ వర్క్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.