Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరసింహ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ అన్నారు. మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని వివిధ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం కరోనా సైతం లెక్క చేయకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో డబ్బులు కూలీ డబ్బులు రాకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతుందన్నారు. కరోనా కారణంగా మతి చెందిన కూలీలకు ప్రభుత్వం నుండి ఎలాంటి భరోసా లేదని తెలిపారు. కూలీపనులు నిర్వహించేసమయంలో వారికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న ప్రాంతాల్లో డాక్టర్ ను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ వేయాలని కోరారు. కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన వారికి పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులు తక్షణం విడుదల చేసి చెల్లించాలని అధికారులను కోరారు. లేనిపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.