Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్‌లో రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో రూ.3.80 కోట్లతో ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని మంత్రి బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ారికి మెరుగైన వైద్యం అందిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 19 జిల్లాల్లో రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారన్నారు. త్వరలోనే మిగతా జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ కార్యక్రమంలో ఆర్అండ్ బీ అధికారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పాల్గొని మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండ అధికారులు కాంట్రాక్టర్లు సమన్వయంతో సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను, పెండింగ్‌లో ఉన్న వాటిని కూడ త్వరగా పూర్తి చేయాలన్నారు. వికారాబాద్ నుండి తాండూర్ రోడ్డు, కాగ్నా నది బ్రిడ్జి పనులు, దోర్నాల బ్రిడ్జి పనులను, కొడంగల్ నుండి గుల్బర్గా రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నియోజకవర్గం వారీగా శాసనసభ్యుల సహకారంతో నిధులు మంజూరు చేయించుకోవాలని సూచించారు.
అంతకు ముందు పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షస్తూ ఈ సారి వరి పంట సంవద్ధిగా పండినందున జిల్లాలో ఇప్పటి వరకు 77 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 56 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించినట్టు తెలిపారు. మరో 20 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించి నియోజకవర్గం వారీగా ఏర్పాటు చేసిన గోదాములకు తరలించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో అర్హులైన 2,818 మంది లబ్దిదారులకు 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ అధికారులు ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలు యాదయ్య, మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళి కష్ణ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజరు కుమార్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాస్‌రావు, ఈఈ లాల్ సింగ్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, డీసీఎస్వో రాజేశ్వర్, సివిల్ సప్లై డీఎం విమల, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ పాల్గొన్నారు.