Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన 9 కుటుంబాల అనాథ పిల్లలకు ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాపూర్‌లో ఇటీవల కరోనాతో శ్రీనివాస్‌రెడ్డి చనిపోవటంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథó పిల్లల సంక్షేమం గురుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ప్రధానంగా విద్య, వైద్య సదుపాయాలతో పాటు పునరావాసం కల్పించటానికి కషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇటీవలి కాలంలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన టుంవంటి 9 కుటుం బాలను గర్తించి వారి ఇంటి ఇంటికి వెళ్లి రెండు నెలలకు సరిపడా నిత్యావసరసరుకులను అందజేస్తు వారికి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్‌ను కూడా అనాథ బాలబాలికలకు అందిచటం జరుగు తుందని, ఈ ఫోన్లో బాలలకు సంరక్షణ కొరకు పనిచేస్తున్న అన్ని లైన్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్లు, ఇతర ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్లను ఫీీడ్ చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా అధికారులను సంప్రదించాల న్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఇలాంటి వారికి అండగా ఉండాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఈ బాలలు తమ సంబంధీకులు, ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బందులకు గురైనా అందులోని ఫోన్ నెంబర్లకు కాల్ చేసి తమరికి తెలియజేస్తే తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. విద్యా, వైద్య ఇతర సహాయం కోసం తాము అన్నిరకాలుగా శిశు సంక్షేమ శాఖ అధికారులు వీరికి నిత్యం అందుబాటులో ఉంటారని మంత్రి పేర్కొ న్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబం కరోనా బారిన పడి మతి చెందటంతో వారి పిల్లలకు పలు రకాల వస్తువులను మంత్రి అందజేసారు. వీరికి డిగ్రీ వరకు ఉచిత విద్యతో పాటు, నెలకు 3 వేల రూపాయలు ఖర్చుల కోసం అందిస్తామని మంత్రి తెలిపారు.
ఇల్లు కూడా మంజూరు చేస్తాం అన్నారు. జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మెన్ నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మోతి జిల్లాలో అన్ని వేళలా అందుబాటులో ఉండి, సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, బి.ఆర్.బి. కోర్డినేటర్ హర్షవర్థిని, జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.