Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
టీిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే హైదరాబాద్ నగరం మరింత అభివద్ధి చెందుతుందని ముషీ రాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పేర్కొన్నారు. బుధవారం రామ్నగర్ డివిజన్ పరిధిలోని బాగ్లిం గంపల్లి ఆర్టీసీి కల్యాణమండపం వద్ద రూ.4.7 లక్షల నిధులతో ఫుట్పాత్ నిర్మాణం పనులకు, బందావన కాలనీలో రూ.14లక్షలతో నిర్మించనున్న 150 మీటర్ల వీడి సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ రవి చారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజక వర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్య లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ యువ నాయకులు ముఠా జై సింహ, టీఆర్ఎస్ డివిజన్ కార్యనిర్వాహక అధ్యక్షులు రూపుల వివేక్ నాయకులు, రావులపాటి మోజెస్, లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, జనార్ధన్, డివిజన్ ఎస్టి సెల్ అధ్యక్షులు కల్యాణ్ నాయక్, ఎర్రం శేఖర్ ర్, బీజేపీ సీనియర్ నాయకులు నైషధం సత్యనారాయణ మూర్తి, బెజవాడ రవి, బీజేవైఎం ముషీరాబాద్ అధ్యక్షులు గడ్డం నవీన్, నాయకులు తోట్ల గోపి తదితరులు పాల్గొన్నారు.
నినాదాలు ఎందుకు? :
శంకుస్థాపన సమయంలో సందర్భం లేకుండా బీజేపీ కార్యకర్తలు ''భారత్ మాతాకీ జై'', జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే కల్పించుకొని తెలంగాణ ఉద్యమంలో నినాదాలు చేసి చేసి ఈ స్థాయిలో ఉన్నామని, అభివద్ధి పనులు ప్రారంభ సమయంలో నినాదాలు అవసరం లేదని బీజేపీ కార్యకర్తలకు హితవుపలికారు.
కరోనా నిబంధనలు గాలికి!!
ఫుట్పాత్, సీసీి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కోసం టీిఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కరోనా నిబంధనలు పాటించకుండా పోటాపోటీగా హాజరు కావడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్య పోవడం బస్తీవాసుల వంతయింది.