Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత రెండు రోజుల క్రితం మన్ కీ బాత్‌లో జాతిని ఉద్దేశిస్తూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా వేయాలని, దానికి అయ్యే ఖర్చు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, ఈ కరోనా లాక్డౌన్ సమయంలో దేశంలో ఉన్న తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ అదనంగా ఐదు కిలోల బియ్యాన్ని మే నెల నుండి వచ్చే నవంబర్ నెల దీపావళి వరకు ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి తెలపడంపట్ల ఎంతో సంతోషదాయకం అని బీజేపీ నాయకులు తెలిపారు. విపత్కర పరిస్థితులలో పేద ప్రజలకు ఎంతో మేలు జరిగే ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి చౌరస్తాలో మేడ్చల్ జిల్లా గిరిజన మోర్చా రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సేవా హి సంఘటన్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజరు కుమార్ పిలుపుమేరకు కరోనా కష్టకాలంలో లాక్డౌన్ సమయంలో నిరు పేదలకు కేహెచ్ఆర్ సేవాదళ్ సహకారంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ ఇంద్రనగర్‌లో బియ్యం, నిత్యావసర వస్తువులు దాదాపుగా వంద మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో రోజు కూలీ వారికి బీజేపీి కేంద్ర ప్రభుత్వం దేశంలోని తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ అదనంగా ఐదు కేజీల బియ్యం ఇవ్వనున్నారని, ప్రధాని నరేంద్ర మోడీకి సాధ్యమని అన్నారు. బీజేపీ నాయకులు కొల్లి మాధవి మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీి అధ్యక్షులు బండి సంజరు కుమార్ పిలుపుమేరకు రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు పేద ప్రజలకు సేవాహి సంఘటన్ ద్వారా మాస్కులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంలో బీజేపీి నాయకులకే సాధ్యమని అన్నారు. హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ట్ర బీజేపీి మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా రూరల్ బిజెపి అధ్యక్షులు పి.విక్రమ్ రెడ్డి, బీజేపీిి సీనియర్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా జెయింట్ సెక్రటరీ దాసి నాగరాజు, మేడ్చల్ జిల్లా రూరల్ ఎస్సీి మోర్చా ప్రధాన కార్యదర్శి అమత, మేడ్చల్ జిల్లా రూరల్ సేవాహి సంఘటన్ కో కన్వీనర్ సుమన్ రావు ,రాష్ట్ర బీజేవైఎం నాయకులు రాజశేఖర్ రెడ్డి, సాదు యాదవ్ ,బిజెపి సీనియర్ నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, జగ్ జీవన్ రెడ్డి, కాశి, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, రవి, బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.