Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ టీకా తీసుకునే విధంగా మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేస్తుందని, ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు తెలిపారు. బుధవారం గండిమైసమ్మ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న కోవిడ్-19, వ్యాక్సినేషన్ సరళిని పరిశీలించారు. హై రిస్క్ పర్సన్స్ ఐన (కిరాణా షాప్, కూరగాయలు షాప్, చికెన్ షాప్, మటన్ షాప్, ఫ్లవర్స్ షాప్, సెలూన్, ఐరన్ షాప్, స్ట్రీట్ వెండర్స్, మెడికల్ షాప్, చిన్న హోటల్స్, శ్మశానవాటికలో పనిచేసే వారికీ) కోవిడ్-19, వ్యాక్సిన్లో భాగంగా గండిమైసమ్మ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు 514 మందికి, మొత్తం ఈరోజు వరకు 2088 మందికి, కోవిడ్-19, వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినట్లు తెలిపారు. ప్రజలు ఫోన్ యాప్ ద్వారా ప్రతిరోజు నమోదుచేసుకుంటే వారికి మరుసటిరోజు వ్యాక్షిన్ ఇవ్వడం జరుగుతుందని , ఈ విధంగా 5 రోజులపాటు ఈ కార్యక్రమం వుంటుంది అని తెలిపారు. ఈ అవకాశాన్ని హై రిస్క్ పర్సన్స్ ఐన (కిరాణా షాప్, కూరగాయలు షాప్, చికెన్ షాప్, మటన్ షాప్, ఫ్లవర్స్ షాప్, సెలూన్, ఐరన్ షాప్, స్ట్రీట్ వెండర్స్, మెడికల్ షాప్, చిన్న హోటల్స్, శ్మశానవాటికలో పనిచేసే వారికీ) అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ కమిషనర్ పి. భోగిశ్వర్లు , కౌన్సిలర్ కోలా సాయిబాబా యాదవ్, ఇంచార్జి డాక్టర్ శ్రిజ, ఏఎన్ఎంలు, సానిటరీ ఇన్స్పెక్టర్స్ కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.