Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ ఫేస్ 3లో రూ.48 లక్షలతో నాలాపై చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణం పనులను బుధవారం స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఇంజనీరింగ్ అధికారు లతో కలిసి ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ కాప్రా సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివద్ధి పనులను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయి నగర్ ఫేస్ 3 వాసులు దారి లేక నీళ్లు లేక పడుతున్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని నాలాపై శాశ్వత ప్రాతిపదికపైన బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం 48 లక్షల రూపాయ లను కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింద న్నారు. రెండు నెలల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేసి కాలనీవాసులకు అందుబాటు లోకి తెస్తామన్నారు.
కాలనీవాసులతో కలిసి పరిశీలించేం దుకు ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శంకర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వెళ్తుండగా స్థానికులు స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని ఎమ్మెల్యేతో వాపోయారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పనిచేయని లైట్లకు మరమ్మతులు చేయించి స్ట్రీట్ లైట్లు లేని దగ్గర కొత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. వెనువెంటనే మరమ్మతులు చేయించి కొత్తగా లైట్లు ఏర్పాటు చేయడంతో జెకె కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఈఈ కోటేశ్వరరావు, డీఈ బాలకష్ణ, ఏఈ సత్య లక్ష్మి, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, పాండాల శివ కుమార్ గౌడ్, శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ప్రతినిధులు విజయ, మాధవి, సత్యం, అరుణ, అంజలి, సుశీల సత్యనారాయణ, వసంత దర్శన్ తదితరులు పాల్గొన్నారు.