Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి నీటి ఎద్దడి సమస్యను నివారించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం కాచిగూడ డివిజన్లోని బర్కత్పులో రూ.10 లక్షల వ్యయంతో చేపడుతున్న తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను స్ధానిక కార్పొరేటర్ కన్నె ఉమారమేష్యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోప్రెషర్ నీటి సమస్య, కలుషిత నీటి సమస్యను పరిష్కరించేందుకు నూతన పైపులైన్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. పైపులైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జల మండలి అధికారులు మహేష్, సన్యాసిరావు, మహేందర్రెడ్డి, నాయకులు అశోక్కులకర్ణి, కృష్ణకుమార్, క్షీర్సాగర్, వాసు హజారీవబబు, అరవింద్, మురళి, సుబాష్పటేల్, సునిల్, దిలీప్, నాగరాజు, రాము, రమాదేవి, మల్లిఖార్జున్, వెంకటేష్, అసీఫ్అలీ, పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.