Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. ప్రేమ్‌నగర్‌కు చెందిన యువత బుధవారం డివిజన్లోని పేదలు, నిరాశ్రయులు, పారిశుధ్య కార్మికులకు ఆహార పాకెట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌తో ఎంతోమంది ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు యువత ముందుకు రావాలన్నారు. పేదలు, నిరాశ్రయులకు యువత చేయూతనివ్వాలని చెప్పారు. ప్రేమ్‌నగర్ యువత సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రేమ్‌నగర్ యువకులు రాగుల సాయికుమార్, రావుల పవణ్‌కళ్యాణ్, నిఖిల్, శ్రీనాథ్, మనోజ్, చరణ్‌రాజ్, వెంకటేష్, శివ వంజరితో పాటు టిఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నర్సింహారెడ్డి, రాగుల ప్రవీణ్‌పటేల్, దయాకర్యాదవ్, మహేష్ గంగపుత్ర, మహేష్ ముదిరాజ్, మహ్మద్ గౌస్, లక్ష్మణ్, బబ్లు, రంగు ఉదరుగౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.