Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
డివిజన్లోని ప్రతి కాలనీలలో మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని గాంధీనగర్, సంజరుగాంధీనగర్, గురుమూర్తినగర్, గిరినగర్, మారుతినగర్, రంగారెడ్డినగర్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ జి.ఆశా, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులపై కార్పొరేటర్ సమీక్ష
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై స్థానిక కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఈఈ కృష్ణ చైతన్యతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో కోట్ల రూపాయాల నిధులతో అన్ని ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మిగిలిన ప్రాంతాలలో కూడా పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రయినేజీ, తదితర పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. డివిజన్లో ఉన్న పలు నాలాలు వెంటనే శుభ్రం చేయించాలని అధికారులను కోరారు.