Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా భృతి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఆటో డ్రైవర్లకు కరోనా భృతి ఇచ్చి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు ప్రశాంత్ బాబు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కంటోన్మెంట్ రోడ్డు పరిధిలోని రెండో వార్డు అన్నానగర్‌లో ఆటో ట్రాలీ డ్రైవర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఈ లాక్ డౌన్ ప్రభావం వారిపై విపరీతంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆటో కార్మికులకు రూ. 7500 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, హనుమంతు, కృష్ణ, యాదగిరి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.