Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-బడంగ్‌పేట
గుర్రంగూడలోని శ్మశానవాటిక అభివృద్ధికి నిధు లు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం కమి షనర్ మోహన్‌రెడ్డికి 6వ డివి జన్ కార్పొరేటర్ దడిగ శంకర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గుర్రంగూడ లోని 6వ డివిజన్లో ఉన్న శ్మశాన వాటికకు సరైన సదు పాయాలు లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో దాదాపు 50 కాలనీలు, 15 వేల జనాభా ఉందనీ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీ వాసులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎవరైనా మృతి చెందితే స్వంత గ్రామానికి తీసుకపోలేక ఇక్కడే అంత్యక్రియలు చేయాలంటే సరైన సదుపాయాల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాహెబ్‌నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతున్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గుర్రంగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 92 లో ఉన్న 3.2 గుంటల శ్మశాన వాటికను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని కమిష నర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి హామీనిచ్చినట్టు కార్పొరేటర్ శంకర్ తెలిపారు.