Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యం లో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ సహకారంతో ప్రగతి నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను బుధ వారం సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఎం.చంద్రశేఖర్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య వారసత్వంతో పుణికిపు చ్చుకున్న భాగంగా సేవా దక్పథంతో నిర్వహిస్తున్న నిర్వాహ కులను అభినందించారు. కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించిన వేళ కరోనా బాధితులు, పేద, మధ్యతరగతి ప్రజానీకానికి సేవ చేయటం ఈ ప్రాంత ప్రజానీకానికి గర్వకారణమన్నారు. డాక్టర్లు, నర్సులు అనునిత్యం పర్య వేక్షణ చేస్తూ మందులు, మంచి పోషకాహారం, యోగా, వినోదం అందిస్తూ ప్రజల ఆరోగ్యమే వారి పరమావధిగా సేవలందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బాధితులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చికిత్స పొందుతున్న వారు, బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్న వారి కోసం మానవతా హృదయంతో వారికి సాయం అందిం చేందుకు ప్రగతి యూత్ అసోసియేషన్ వారు స్వయంగా ఇంటికి వెళ్లి వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు అందజేయడం వంటి సేవలు చేయడం అభినందనీయ న్నారు. ఈ సందర్భంగా కరోనా బాధితులను పరామర్శించి ఆరోగ్య క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రగతినగర్ సుందరయ్య భవన్ నిర్వాహకులకు సహకారం అందిస్తున్న పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ వారికి, ప్రగతి యూత్ అసోసియే షన్ వారికి మేడ్చల్ జిల్లా సీఐటీయూ కార్మికవర్గం తరఫున కృతాజ్ఞతాభివందనాలు తెలియజేశారు.