Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అన్ని ప్రాంతాల్ల్లో శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తా మని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 5,6 వార్డుల్లో రూ. 87 లక్షలతో చేపట్టిన వైకుంఠదామాల అభివృద్ధి పనులకు బుధవారం అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, మున్సిపల్ చైర్మెన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్‌గౌడ్ లతో కలిసి శంకుస్థా పన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రా మం, మున్సిపాల్టీలో వైకుంఠదామాలను అందంగా తీర్చిది ద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్ర మంలో వైస్ చైర్మెన్ ఎం.నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు కొత్త సురేఖా భాస్కర్‌గౌడ్, మంగళపూరి వెంకటేష్, కొత్త హేమ లత శ్రీనివాస్‌గౌడ్, స్వప్న, శ్రీహరిగౌడ్, వసూపతి రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు బేగం మహ్మద్, ఖాజామియా, దమ్మయిగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కౌకుంట్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపన్నబోల్ హరిగౌడ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓర్సు రాములు, మాజీ సర్పంచ్ అనిల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుర్వి వెంకటేష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.