Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
జంట నగరాల పరిధిలోని నాలాల్లో 221 కిలోమీటర్ల మేర పూడిక తొలగింపు కోసం రూ.45 కోట్లు ఖర్చు చేస్తు న్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభి వృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సనత్‌నగర్ నియోజక వర్గం పరిధిలోని రాంగోపాల్ పేట దర్గా వద్ద నాలాపై రూ.2.35 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణ పను లను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరితగ తిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూడిక తొలగింపు పనుల విషయమై ఈ నెల 11వ తేదీన జీహెచ్ఎంసీ కా ర్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలి పారు. ఈ సమావేశంలో తనతో పాటు హౌం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. 124 ప్రాంతా ల్లో 221 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టినట్టు చెప్పారు. నాలాల్లో పూడిక తొలగిం పు వల్ల వర్షాకాలంలో నాలాల్లోకి వచ్చే నీరు సాఫీగా వెళ్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలతో పాటు మురుగు కాల్వలను కలుపుకుని మొత్తం 884 కిలోమీటర్లు ఉన్నాయని తెలిపారు. నాలాల మరమ్మతులు, పూడిక తొల గింపు పనులను ఆరుగురు ఎస్ఈలతోపాటు ఆయా ప్రాం తాల జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రత్యేక మాన్ సూన్ టీంలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందుకోసం 128 మినీ మొబైల్ టీంలు, 68 డీసీఎం వాహనాలను ఏర్పాటు చేశామనీ, ఇందులో ఒక్కో వాహనంలో నలుగురు చొప్పున సిబ్బంది ఉంటారని చెప్పారు. భారీ వర్షాలతో చెట్లు కూలి పోవడం, వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ప్రజలను ఇబ్బ ందులకు గురి చేసే పరిస్థితులు నెలకొంటే వారికి కేటాయి ంచిన ప్రాంతాలకు ఈ టీంలు చేరుకుని సమస్య పరిష్కా రానికి తక్షణ చర్యలు చేపడుతాయని తెలిపారు. గతేడాది కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో బీటీ, సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. 182 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు మరమ్మతు పనులను రూ.52 కోట్లతో చేపట్టగా ఇప్పటి వరకు 100 కిలోమీటర్ల పనులు జరిగాయని చెప్పా రు. 753 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం పనులు రూ.204 కోట్లతో చేపట్టగా, ఇప్పటి వరకు 272 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ ఏడాది బాక్స్ డ్రైయిన్స్ నిర్మాణం, డ్రైయిన్స్ మరమ్మతులు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, చైన్ లింక్ మెష్ వంటి 468 పనులను రూ.298 కోట్లతో చేపట్టామని తెలిపారు. ఇందు లో రూ.16 కోట్ల విలువైన 42 పనులు పూర్తయినట్టు చె ప్పారు. 211 పనులు వివిధ దశల్లో ఉన్నాయనీ, మిగిలిన 147 పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు పేర్కొన్నా రు. ఈ ఏడాది చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొణతం దీపిక, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణగౌడ్, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ శివానంద్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలెక్ట్రికల్ ఏఈ రామకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణ, తదితరులు ఉన్నారు.