Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్‌డౌన్‌లోనూ బల్దియా నిర్లక్ష్యం
- ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు బ్రిడ్జీ
- వర్షాకాలంలో మరింత ఆలస్యం
- గడువులోగా కష్టమేనంటున్న సంబంధిత ఇంజినీర్లు వేగంగా చేపట్టాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు 2.610 కిలో మీటర్ల పొడవు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ను వినియోగి ంచుకోవడంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాం ట్రాక్టు ఎజెన్సీ విఫలం కావడంతో పనులు నెమ్మ దిగా జరుగుతున్నాయి. పైగా వర్షాకాలం రావడ ంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపి స్తున్నాయి. గడువులోగా స్టీల్ బిడ్జ్రీని పూర్తి చేయ డం కష్టమేనని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఇందిరాపార్కు-వీఎస్టీ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరాపార్కు నుంచి..
ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ, రాంనగర్- బాగ్‌లింగంపల్లి మార్గంలో రూ.426కోట్లతో రెండు ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.350కోట్లతో ఇందిరాపార్కు -వీఎస్టీ, రూ.76కోట్లతో రాంనగర్- బాగ్ లింగంపల్లి ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ ఇందిరాపార్కు వద్ద గల గణేష్ టెంపుల్ నుంచి ప్రారంభమై వీఎస్టీ జంక్షన్ (అజాబాబాద్) నుంచి విద్యానగర్ వెళ్లే మార్గంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పూర్తవు తుంది. ఈ కారిడార్‌లో ఫ్లైఓవర్ నిర్మాణానికి మిసెస్ స్టఫ్ అనే కన్సల్టెన్సీ డిటేల్డ్ ప్రాజెకు ్ట(డీపీఆర్)ను రెడీ చేసింది. ఈ కారిడార్ పూర్తయి తే లోయర్ ట్యాంకు బండ్‌లోని కట్టమైసమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ఉస్మాని యా యూనివర్సిటీతోపాటు నల్లకుంట మీదుగా కాచిగుడ వెళ్లడానికి అవకాశముంది. ఈ మార్గం లో త్రీవంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను తగ్గించ డానికి అవకాశముంది. మొత్తం 2.610 కిలో మీటర్ల కారిడార్‌లో ప్రధాన కారిడార్ (స్టీల్ వంతెన) 2.090 కిలో మీటర్లు మాత్రమే. ఇందిరా పార్కు వద్ద ప్రారంభమయ్యే ర్యాంపు 270 మీటర్లు, వీఎస్టీ జంక్షన్ (అజామాబాద్) సమీపంలో విద్యుత్ సబ్‌స్టేషన్ డౌన్ ర్యాంపు 530 మీటర్లు ఉంటుంది. నాలుగు లేన్లు ఉం టుంది. దీనికి భూసేకరణ చేయాల్సి తక్కువగా ఉంది. ప్రారంభమయ్యే ర్యాంపు, దిగే ర్యాంపు కోసం భూసేకరణ చేయాల్సి ఉంది.
ఆరు జంక్షన్ల అభివృద్ధి..
2.619 కిలో మీటర్ల కారిడార్‌లో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్, అశోక్‌నగర్ క్రాస్ రోడ్డు జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు జంక్షన్, వీఎస్టీ జంక్షన్ (బాగ్‌లింగంపల్లి వెళ్లే మార్గం), వీఎస్టీ జంక్షన్ (రాంనగర్ వెళ్లే మార్గం)ను అభి వృద్ధి చేయడానికి అధికారులు డిజైన్ రూపొంది ంచారు. ఈ కారిడార్‌ను పూర్తి చేసిన తర్వాత ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వెళ్లే మార్గంలో 840 మీటర్ల పొడవులో మూడు లేన్ల ఇండిపెండెంట్ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు.
గడువులోగా కష్టమే?
రెండు స్టీల్ బ్రిడ్జీల నిర్మాణానికి 2020 జులైలో శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 2022 వరకు పూర్తి చేయాలని గడువు విధించారు. అ యితే ప్రస్తుతం పనులు నత్తనడకన జరుగుతు న్నాయి. పనులు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. లాక్డౌన్లో వేగంగా జరగాల్సిన పనులు అందు కు విరుద్ధంగా ఉన్నాయి. దీంతోపాటు వర్షాకా లం సైతం రావడంతో పనులు ఆలస్యమయ్యే అవకాశముందనీ, గడువులోగా పూర్తికావడం కష్టమేనని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయప డుతున్నారు.
పనులు వేగవంతం చేయాలి
ఇందిరాపార్కు-వీఎస్టీ స్టీల్ బ్రిడీ పనులను వేగవంతం చేయాలి. ఇప్పటి వరకు పునాదులు కూడా పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ప్రజలు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువులోగా పూర్తి చేయాలి.
సీపీఐ(ఎం), గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి, ఎం.శ్రీనివాస్