Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే వారం నుంచి రేషన్ కార్డుల పంపిణీ
- అర్హులకు అందించాలని ఆదేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్త రేషన్ కార్డుల జారీకి ఎట్టకేలకు మోక్షం లభిం చింది. రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారిలో మంగళవారం నాటి క్యాబినెట్ నిర్ణయంతో ఆశలు చిగు రించాయి. కార్డుల మంజూరుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయం నిరుపేదలకు ఊరట కలిగిం చింది. ఈ క్రమంలో బుధవారం జిల్లా మంత్రులు తల సాని, మహమూద్ అలీ సంబంధిత అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించి కార్డుల పంపిణీ వేగిరం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లో అర్హులైన పేదలకు కార్డులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా జిల్లాలో 99, 104 దరఖాస్తుల పరిశీలన చేసి కార్డులను జారీ చేయ నున్నారు. మార్పులు చేర్పులు (మ్యూటేషన్) కోసం వచ్చిన 48,498 దరఖాస్తులూ క్లియర్ కానున్నాయి.
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది సర్కి ళ్లు ఉండగా, 673 పౌరసరఫరాల దుకాణాలుకు గాను 613 పని చేస్తున్నాయి. జిల్లాలో 5,80,584 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 5.48 లక్షలకుపైగా ఉండగా, అన్నపూర్ణ కార్డులు 1312, అంతోద్యయ కార్డులు 30వేలకుపైగా ఉన్నాయి. నగరంలోని వివిధ రేషన్ దుకాణాల ద్వారా దాదాపు 5,12,882 మంది లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రతినెలా సుమారుగా 1,36,28,385 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
అయిదేండ్లుగా కొత్తకార్డుల ఊసే లేదు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. 2016 నుంచి 2017 డిసెంబర్ వరకు కొత్త కార్డులు దరఖాస్తులను తీసుకోవడంతో పాటు జారీ చేసింది. 2018 ఏడాదంతా బంద్‌గా ఉంది. 2018 డిసెంబర్ నుంచి 2019 జూన్ వరకు మళ్లీ కొత్త కార్డులకు దరఖాస్తులను ఆహ్వానించగా, 2019 జూన్ నుంచి నేటి వరకు వరకు ఆ ఊసే ఎత ్తలేదు. ఈ ఆరేండ్ల కాలంలో సుమారు 1.77లక్షల మం ది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 93,755 దరఖాస్తులు ఆర్ఐల వద్ద పెండింగ్ లో ఉండగా, ఏఎస్‌వోల వద్ద 3,499, డీఎస్వో వద్ద 1,848 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో నుంచి 44,734 డీఎస్వో వద్ద ఆమోదం లభించగా, మరో 5,353 కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వివిధ కారణాల రీత్యా 31,528 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇక కొత్తరేషన్ కార్డులతో పాటు మార్పు లు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటికి కూడా ఆమోదముద్ర పడకపోవడంతో సుమారు 99, 668 కార్డుల్లో 48,498 మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం..
కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏండ్లు గడుస్తున్నా కార్డులు జారీ కాకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కావాల్సి వస్తోం దని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చి కరోనా, లాక్డౌన్ సమయంలో ప్రభు త్వం రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.1500 నగదు, రెండు కిలోల కందిపప్పు, 12 కిలోల ఉచిత బియ్యం అందించింది. ఇలా ఆరునెలల పాటు అందిం చింది. సెకండ్ వేవ్, లాక్‌డౌన్‌లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కలిసి కార్డులోని ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాయి. రేషన్ కార్డులు లేని వేలాదిమంది అర్హులు వీటికి దూరమవుతున్నారు.