Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేవైఎం రమన్ సింగ్ బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్లేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో సుమారు 500 ఆహార డబ్బాలను రోగులు, వారి బంధువులతో పాటు కోవిడ్-19 ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఆహార వితరణ చేశారు. ఈ సందర్భంగా రమన్ సింగ్ మాట్లాడుతూ ఈ వారం రోజులు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకునికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయవంతం చేయడానికి కృషి చేసిన తమ్ముళ్లు అందరికీ అభినందనలు తెలపడంతో పాటు కష్టకాలంలో నేను సైతం అంటూ ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతిఒక్క అన్నదాతకు పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేంద ర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్, పార్టీ నాయకులు ప్రేమ, మధు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.