Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే ప్రభుత్వం పట్టించు కోవడం లేదనీ, పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు నల్లెల్ల కిషోర్ తెలిపారు. బుధవారం టీడీపీ హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషోర్ మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందనీ, వేలాది మంది కరోనా బారిన పడుతున్నా రని తెలిపారు. లాక్డౌన్తో వాణిజ్య, వ్యాపార సముదా యాలు, ప్రయివేటు కార్యాలయాలు మూతపడటంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారనీ, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కార్మికులు, చిరువ్యాపారులను అత లాకుతలం చేస్తున్న కరోనా నివారణకు పట్టిష్టమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నా రు. కరోనా బారినపడుతున్న వారు వైద్యం చేయించుకోలేక దిక్కుతోచని స్థితిలో పడుతున్నారన్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం చేయించుకోలేక మరణిస్తున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో నగరవాసులు కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశా రు. కరెంటు, వాటర్ బిల్లుల పేరుతో ప్రజల నుంచి అక్రమంగా రూ.వేలకోట్లు వసూలు చేస్తోందని ఆరోపించా రు. ప్రతి ఇంటికీ 20వేల లీటర్ల మేరకు ఉచితంగా మంచి నీరు ఇస్తామని సీఎం హామీనిచ్చారని గుర్తు చేశారు. ఏ రక మైన బిల్లులుండవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 4 నెలల బిల్లులను బలవంతంగా వసూలు చేస్తోందని ఆరోపి ంచారు. మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నార న్నారు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలనీ, కంరె టు, మంచినీటి బిల్లులును పూర్తిగా రద్దు చేయాలని డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు పి.బాల రాజ్గౌడ్, కె.కొమురన్న, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కె.బోసు, తదితరులు పాల్గొన్నారు.