Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని డివిజన్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇవ్వండి
నవతెలంగాణ, ఓయూ
అడ్డగుట్ట డివిజన్ వెంకటనగర్ బీజేపీి నాయకురాలు, మహిళా మండలి అధ్యక్షురాలు రాము లమ్మ, వారి భర్త మల్లేష్, అనారోగ్య కారణంగా మరణిం చడంతో ఇట్టి విషయాన్ని అడ్డగుట్ట బీజేపి నాయకులు, హంసరాజు, రాజుగౌడ్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు బండ చంద్రారెడ్డి దష్టికి తీసుకెళ్లడంతో, వారు తక్షణమే స్పందించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయన్ని గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ విషయంలో డిప్యూటీి స్పీికర్ పద్మారావు రాజకీయం చేస్తున్నాడని, గత వారం వరకు సికింద్రాబాద్ నియోజక వర్గం అన్ని డివిజన్లలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేవాళ్లని ఇప్పుడు ఒక్క సీతాఫల్‌మండిలోని మల్టీఫ్లెక్స్ కమ్యూనిటీహాలులో ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అన్ని డివిజన్ ప్రాంతవాసులు రూ.300లు ఆటో చార్జీలు పెట్టుకుని సెంటర్‌కు వెళ్ళాల్సిన పరిస్ధితి ఏర్పడిందని, అక్కడ సెంటర్లో భౌతిక దూరం లేకుండా ఒక వ్యాక్సిన్ వేసుకోవాలంటే దాదాపు నాలుగు గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం తానే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు పద్మారావు రాజకీయలు చేస్తున్నాడని చంద్రారెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి మోది స్వయంగా అందరికీి ఉచితంగా ఏరియా ప్రాంతాల వారిగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెబుతుంటే టీిఆర్‌ఎస్ నేతలు అన్ని డివిజన్లు కలిసి ఓకే చోట ఇవ్వడం ఇది ముమ్మాటికీి రాజకీయమేనన్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా బీజేపీి, ఉపాధ్యక్షుడు, రాచమల్ల కష్ణమూర్తి, సెక్రటరీ వీరన్న, అడ్డగుట్ట డివిజన్ బిజెపి నాయకులు నాయకులు, రాజుగౌడ్, హంసరాజు, శ్రీనివాస్‌లు, మోహన్, వెంకటస్వామి, మహేష్, తదితరులు పాల్గొన్నారు