Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
దేశంలోని ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీదేనని బీజేపీ ఓటసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో ఇప్పటి వరకు 26 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. తాజాగా 4 కోట్ల మందికి వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు కంపెనీలకు ఆర్డర్లిచ్చిందన్నారు. గురువారం బాగ్ లింగంపల్లి సూర్యనగర్లోని పేద ప్రజలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గడ్డం నవీన్, వై.రత్నాకర్, బెజవాడ రవీందర్, శ్రీనివాస్, ఉపేందర్, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు .