Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం నల్లకుంట డివిజన్లోని తిలక్‌నగర్ బస్తీ కమ్యూనిటీ హాల్లో వివిధ శాఖల అధికారులు, కాలనీ వాసులతో నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిలక్‌నగర్ కమ్యూనిటీ హాళ్ళను బస్తీ దవాఖానాలుగా మార్చడంతో పాటు అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టాలన్నారు. అనేక బస్తీలలో లోప్రెషర్ నీటి సమస్యతో పాటు కలుషిత నీటి సమస్యల ఉందన్నారు. డ్రయినేజీ పైపులైన్ నిర్మాణం కోసం రోడ్లు తవ్వి వదిలేస్తున్నారన్నారు. అంబేద్కర్ ప్లేగ్రౌండ్‌లో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఎమ్మార్వో వేణుగోపాల్, వీఆర్వో బద్రినాథ్, మహేష్, వాటర్ వర్క్స్ ఏఈ మాజీద్, బస్తీ వాసులు సత్యనారాయణ, పవన్, రాజు, నర్సింగ్, శ్యామ్, జగన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.