Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు హరి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్‌పేట్
తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశ ప్రజలకు సంపూర్ణ న్యాయ సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ అధ్యక్షులు హరి మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ ఆయనకు హదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం చారిత్రిక ఆదిశక్తి కోటేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఏర్పడినప్పటికీ, వాటిని అధిగమించి దేశ ప్రజలకు న్యాయ సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లింగం నారాయణ, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.