Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరు పేద ప్రజలకు ఎల్లవేళలా కూన కష్ణ గౌడ్ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. సేవాహి సంఘటన్లో భాగంగా కూన కష్ణ గౌడ్, మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్, సీనియర్ నాయకులు హెచ్ఏఎల్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఏ. మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్ ఎం రాము గౌడ్, పి కష్ణారెడ్డి కౌన్సిలర్, కూన కష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.